Header Banner

ఇది తమ కుటుంబానికి ఎంతో భావోద్వేగభరితమైన రోజన్న లోకేశ్! ఈ పవిత్రమైన కార్యక్రమంలో..

  Wed Apr 09, 2025 16:50        Politics

రాష్ట్ర రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నూతన ఇంటి నిర్మాణానికి నేడు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ పాల్గొన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంపై లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "ఇవాళ నాకు, నా కుటుంబానికి ఎంతో భావోద్వేగభరితమైన రోజుగా నిలిచిపోతుంది. కోట్లాది మంది ప్రజల కలల ప్రతిరూపం రాజధాని అమరావతిలో మా కొత్త ఇంటి నిర్మాణానికి మా నాన్న చంద్రబాబు గారు భూమి పూజ చేయడాన్ని ఎంతో గర్వంగా, కృతజ్ఞతా భావంతో వీక్షించాను.

 

ఇది కూడా చదవండి: మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మా నాన్న ఊహించిన ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని నిర్మించాలన్న కలకు ఇది పునరుజ్జీవనం. ఈ పవిత్రమైన కార్యక్రమంలో నా తల్లి భువనేశ్వరి, నా శక్తికి మూలస్తంభం నారా బ్రాహ్మణి, నా ముద్దుల కుమారుడు దేవాన్ష్ తో కలిసి పాల్గొనడం ఒక దీవెన వంటిది. ఇది మా ఇల్లు మాత్రమే కాదు... మా నిబద్ధతకు ప్రతీక. అమరావతిని మర్చిపోలేదు... దీన్ని మరింత బలంగా, మరింత పట్టుదలతో, ఎన్నడూ లేనంత మరింత అందంగా పునర్ నిర్మిస్తున్నాం. మన రాజధాని మళ్లీ పునరుజ్జీవం పొందుతోంది... అలాగే మన ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి కూడా దూసుకుపోతోంది" అంటూ లోకేశ్ పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

 

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting